తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

దివ్యాంగుల శక్తి పేరుతో, వారికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా…. కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో జరిగిన కార్యక్రమంలో, దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. తమకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 11 లక్షల మందికి పైగా దివ్యాంగులకు, ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైకల్యాన్ని బట్టి పింఛన్ మొత్తాన్ని పెంచిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. తాత్కాలిక వైకల్యం ఉన్నవారికి 6వేలు, శాశ్వత వైకల్యం ఉన్నవారికి 15వేల రూపాయలు వంతుల పింఛన్ ఇస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు కి దక్కిందన్నారు. మొదటినుంచి దివ్యాంగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మనసుతో ప్రేమాభిమానాలు చూపుతూనే ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే వారికి ఉచితంగా ట్రై సైకిళ్లు, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహకాలను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులకు త్వరలో ఇళ్లపట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పేదల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల మనసులు గెలుచుకున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. స్త్రీశక్తి పథకం మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉందని, రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్టీసీ బస్సు ప్రయాణమే సురక్షితమని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఎమ్మెల్యే కోరారు. నియోజవర్గంలో ఇప్పటివరకు 10 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పేదలకు అందించామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఆర్. శ్రీనివాసులు, కంట్రోలర్ ఇన్స్పెక్టర్ ప్రసాదు, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ఏపీఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, పార్టీ నేతలు రెబ్బవరపు మాల్యాద్రి, చుండూరి శ్రీను, రాయపాటి శ్రీను, పసుపులేటి రమణయ్య, కొత్తూరి వెంకట సుధాకర్, కోట కిషోర్, యర్రా ముసలయ్య, ఆర్టీసీ యూనియన్ నాయకులు మహేష్, శివ, సుబ్బారావు, రాజు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *