తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, పోక్సో చట్టం, మహిళలకు సంబంధించిన నేరాలు, కోడి పందాలు మరియు గ్యాంబ్లింగ్ వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు వివరంగా తెలియజేస్తున్నారు.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరించారు.పిల్లల రక్షణ కోసం పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించి, మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోడి పందాలు, గ్యాంబ్లింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *