తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తరాశిపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు గ్రామ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకోకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, శాంతి భద్రతలను పటిష్టం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో విస్తృత ప్రాంతాన్ని పరిశీలిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ముందుగానే గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తూ, గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, ఎలాంటి అనుమానాస్పద అంశాలు గమనించిన వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *