తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-

కోవూరు పట్టణంలోని మసీదు వీధికి చెందిన పఠాన్ జబీవుల్లా ఖాన్ కుమారుడు ఐదేళ్ల రెహాన్ ఖాన్ చికిత్స కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేవేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరులోని వారి నివాసంలో చిన్నారి రెహాన్ ఖాన్ భౌధిక కాయానికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. జబీవుల్లా ఖాన్ కుమారుడు రెహాన్ ఖాన్ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మానవత్వంతో స్పందించి చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి అధికారులతో మాట్లాడి తక్షణమే 3 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి జబివుల్లా కుటుంబానికి అండగా నిలిచారు.అయితే చికిత్స నిమిత్తం ఆటోలో ఆసుపత్రికి వెళ్తుండగా ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రెహాన్ ఖాన్ మృతి చెందాడు. అదే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తండ్రి జబీవుల్లా ఖాన్ ప్రస్తుతం చెన్నైలోని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. చిన్నారి మరణవార్త విన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారి రెహాన్ ను కాపాడుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని జబీవుల్లా ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడమే కాకుండా భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోవూరు టిడిపి ముఖ్య నాయకులతో పాటు పలువురు మైనారిటీ నాయకులు కూడా పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *