తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మహిళల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “శక్తి యాప్” పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు మరియు విద్యార్థులకు శక్తి యాప్ వినియోగంపై వివరంగా తెలియజేశారు.పోలీసు అధికారులు శక్తి యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ కావాలి, అత్యవసర పరిస్థితుల్లో యాప్ను ఎలా ఉపయోగించాలి అనే విషయాలను ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం చేరడంతో పాటు, లొకేషన్ ట్రాకింగ్ ద్వారా త్వరితగతిన సహాయం అందించవచ్చని తెలిపారు.మహిళలు ఎటువంటి భయాందోళనలు లేకుండా సురక్షితంగా జీవించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి మహిళ తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని పోలీసులు సూచించారు.అలాగే ఈ యాప్ గురించి ఇతరులకు కూడా తెలియజేసి, సమాజంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు మహిళల రక్షణకు కట్టుబడి ఉండి, సాంకేతికతను వినియోగిస్తూ భద్రతా సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తున్నారని తెలిపారు.