— ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:-
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వహక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, అదేవిధంగా తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ విప్, కుప్పం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు అందజేశారు. అదే సమయంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కు సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకి కార్యనిర్వహక కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.