తొలి శుభోదయం న్యూస్ కొమరోలు:-

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల పంచాయితీ తాటిచెర్ల గ్రామానికి చెందిన గంగిపోగు చిన్నప్ప కుటుంబం తీవ్రమైన అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసి కొమరోలు మండల టిడిపి అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు స్పందించారు.
ఆ కుటుంబ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆయన, వెంటనే రూ.5,000 ఆర్థిక సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒంటరిగా ఉండవని, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
స్థానిక ప్రజలు బోనేని వెంకటేశ్వర్లు చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *