100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పేద పిల్లల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ

తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-

ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో APSWREIS, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఇంటర్ లో పెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్దం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అందుకోసం ప్రతి జిల్లాకు బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు వరకు శిక్షణ ఇచ్చి 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. పేద పిల్లల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *