తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించిన… కందుకూరు పట్టణంలోని సాయిబాబా ఐఐటి- జేఈఈ మరియు నీట్ అకాడమీ విద్యార్థులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం అభినందించారు.మొదటి సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను… దాసరి రేణుక వెంకటలక్ష్మి, ముచ్చు గోపీనాథ్ 466 మార్కులు సాధించారు. రెండవ సంవత్సరం పరీక్షల్లో జజ్జారపు లక్ష్మి 1000 కిగాను 991 మార్కులు సాధించింది. స్థానిక టిడిపి కార్యాలయంలో విద్యార్థులను ఎమ్మెల్యే గారు అభినందించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ గొర్రెపాటి రామారావు, కరస్పాండెంట్ గుంటూరు శ్రీనివాసులు, డైరెక్టర్ శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.