తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-

ఐక్య పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పి కల్పన తెలియజేశారు. కనిగిరి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కనిగిరి మండల సిఐటియు కమిటీ సమావేశం మండల కన్వీనర్ పి నరేంద్ర అధ్యక్షతన శుక్రవారం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కనిగిరి ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా తొలగించడం అన్యాయమని వారిని వెంటనే విధుల లోకి తీసుకోవాలన్నారు. మున్సిపల్, అంగన్వాడి, ఆశ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పిసి కేశవరావు,సీఐటీయూ నాయకులు ఓబయ్య, బాలస్వామి, టోపీవలి, సీత, భాగ్యలక్ష్మి, రజిని, మాదవి, రమాదేవి,పద్మ, అచ్చమ్మ,చెన్నమ్మ,ప్రసాద్, అడివయ్య రిజ్వాన తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *