తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-

ఉలవపాడు ప్రాజెక్టు పరిధిలోని గుడ్లూరు మండలం తెట్టుసెక్టార్ లోని రావూరు పంచాయతీలో ఉన్న రావూరు అంగన్వాడి సెంటర్ నందు ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకు పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కామేశ్వరి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు. బాలింతలు .ఏడు నెలల నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు పోషణ పక్వాడ గురించి తెలియపరచడం జరిగింది. చిన్నపిల్లల మానసిక వికాసానికి అడ్డంగా మారుతున్న సెల్ ఫోన్లు. టీవీలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యక్రమం కేంద్ర .రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అలాగే రోజువారి ఆహారపు అలవాటుగా మారుతున్న జంక్ ఫుడ్ తీసుకోవడం వలన పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని. జంక్ ఫుడ్ వలన కలిగే నష్టాల పై అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లు టీవీలు చూడటం వలన వారి మానసిక వికాసం దెబ్బతింటుందని .తద్వారా ఆలోచన శక్తి .తెలివితేటలు. సృజనాత్మకత .మందగిస్తుందని. అలాగే మరి కొంతమందిలో మాటలు రాకపోవడం .చూపు మందగించడం. ఊహాశక్తి లోపించటం. తదితర సమస్యలు తలెత్తుతాయని .బుల్లితెర కు చిన్నపిల్లలను దూరంగా ఉంచేందుకు చక్కటి కథలు. ఆటపాటల. ద్వారా భాష నైపుణ్యాలు ఆరుబయట ఆటలను ఆడించడం సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించడం. వంటివి చేయాలని అంగనవాడి కార్యకర్తలకు గర్భవతులకు బాలింతలకు సూచించడం జరిగింది. ఇటీవల కాలంలో జంక్ ఆహారం వినియోగించడం పెరిగిందనీ. ముఖ్యంగా బాలింతలు గర్భవతులు ఈ ఆ హారం తీసుకోవడం వలన మధుమేహం .గుండె జబ్బులు. మూత్రపిండాల సమస్యలు .ఎక్కువగా తలెత్తుతున్నాయనీ. పోషణ పక్వాడ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తూ. ప్రకృతి సహజ సిద్ధమైన చిరుధాన్యాలు ఆకుకూరలు .కూరగాయలు .పండ్లు .తీసుకునేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త . మౌనిక .గర్భవతులు. బాలింతలు. పిల్లలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *