తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊళ్లపాలెo గ్రామంలో గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,750 నగదు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూద కార్యకలాపాలు చట్టవిరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇటువంటి దాడులు కొనసాగుతాయని తెలిపారు.ప్రజలు అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *