తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం జిల్లా కంభం:-


మండలంలోని స్థానిక గవర్నమెంట్ హైస్కూల్, జంగంగుంట్ల జడ్పీ హైస్కూల్,తురిమెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం క్లస్టర్ స్థాయి గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసి,న్యూమరసి ప్రతిభా పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు.75 రోజుల జిఎఫ్ఎల్ఎన్ కార్యాచరణ ప్రణాళికలు పూర్తయిన సందర్భంగా ఆయా క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు క్లస్టర్ స్థాయి ప్రతిభా పరీక్షను నిర్వహించినట్లు ఎంఈఓలు టి.అబ్దుల్ సత్తార్,టి. శ్రీనివాసులు తెలిపారు. క్లస్టర్ స్థాయి జిఎఫ్ఎల్ఎన్ ప్రతిభా పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను మండల స్థాయికి ఎంపికచేయనున్నట్లు,మండల స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు ఎంఈవోలు తెలిపారు. జిల్లా స్థాయి జిఎఫ్ఎల్ఎన్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను, ప్రశంసాపత్రాలను అందించనునట్లు ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు,క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు గని.వెంకటేశ్వర్లు, మొయినుద్దీన్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, సిఆర్పీలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *