తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-

కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో శనివారం సాయంత్రం విశ్రాంత వ్యవసాయ అధికారి కామ్రేడ్ సూరసాని లక్ష్మీరెడ్డి ఏడవ వర్ధంతి సభన సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పి సి కేశవరావు అధ్యక్షతన జరిగింది. అనంతరం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి డి సోమయ్య, డాక్టర్ చెన్న కృష్ణ, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి లు హాజరయ్యారు. లక్ష్మీరెడ్డి చిత్రపటానికి ఎస్ అచ్చిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి సోమయ్య మాట్లాడుతూ కామ్రేడ్ సురసానిలక్ష్మి రెడ్డి వ్యవసాయ అధికారిగా సేవలు అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన కృషి మరువలేనిది అన్నారు. కనిగిరి ప్రాంతంలో సిపిఎం బలోపేతానికి ఆయన అందించిన సహకారం ఎనలేనిది అన్నారు. సుందరయ్య భవన నిర్మాణానికి స్థలాన్ని అందజేశారని, తరువాత లక్ష్మి రెడ్డి కుటుంబ సభ్యులు భవన నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించి ఆయన భావజాలాన్ని వారు నిరూపించారన్నారు. వెనుకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు ఒక్కటే పరిష్కార మార్గమని ఆయన తెలిపారు. నిర్లక్ష్యం లేకుండా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తగినంత నిధులను కేటాయించాలని అన్నారు. అత్యంత వెనుకబడిన కనిగిరి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పిల్లి తిప్పారెడ్డి, మాల్యాద్రి, పి మహేష్, సూరసాని లక్ష్మీరెడ్డి సతీమణి తిరుపతమ్మ, కుమారుడు విజయ్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులతో పాటు మాలకొండ రెడ్డి, బ్రహ్మ రెడ్డి, శ్రీనివాసులు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *