తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంత్వనా సేవ సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ మాట్లాడుతూ… నీటి ప్రాముఖ్యత, సరఫరా, పరిరక్షణ, అవసరాన్ని గుర్తు చేసుకోవటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభాలను అధిగమించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడమే దీన్ని ముఖ్య లక్ష్యం అన్నారు నీటి సంరక్షణ మంచినీటి వనరులు రక్షణ వాతావరణ మార్పులు ప్రభావాన్ని అరికట్టే చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కందుకూరు రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు, సాంత్వనా సిబ్బంది డొక్కా కిషోర్ బాబు, ఎం రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.