తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ఒంగోలులో మంగమూరు రోడ్డు మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు . బి. ఎన్. విజయ్ కుమార్ ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రజల నుండి మొత్తం 30 అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు వంటి అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా రావడంతో, వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు.ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇవ్వగా, ఎక్కువశాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేశారు. ప్రజా సమస్యలను సాంకేతిక,ఆర్థికపరంగా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు పని చేస్తానని ప్రజలకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *