తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో మహిళల రక్షణ మరియు బాలల భద్రతే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మార్కాపురం మరియు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలకు ‘శక్తి యాప్’ విశిష్టతను వివరిస్తూ, ఆపద సమయంలో ఈ యాప్ ఎలా రక్షణ కవచంలా పనిచేస్తుందో క్షేత్రస్థాయిలో ప్రదర్శించి చూపారు. ప్రతి మహిళా తమ ఫోన్లలో ఈ యాప్‌ను కలిగి ఉండటం ద్వారా తక్షణ పోలీస్ సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు. మరోవైపు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడటానికి జంగంగంట్ల జడ్పీ హైస్కూల్, ఒంగోలు విజ్ఞాన్ భారతి స్కూల్ మరియు కకర్ల హైస్కూల్‌లలో ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ పై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు ఆత్మీయంగా అవగాహన కల్పిస్తూ.. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు మరియు మానవ అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్మతల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది కలిగితే భయం లేకుండా ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాజంలో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ సాంకేతికతను మరియు సామాజిక అవగాహనను జోడించి ముందుకు సాగుతోందని ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టమైంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *