తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మహిళలు, పిల్లల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని శక్తి యాప్ (Sakthi App) వినియోగం మరియు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, గ్రామాలు మరియు వివిధ సమాజ వర్గాల మధ్య ఈ కార్యక్రమాలు నిర్వహించి, పిల్లలు మరియు మహిళలకు భద్రతపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమాలలో పోలీస్ అధికారులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించి, ఏదైనా అనుమానాస్పద లేదా అసౌకర్యంగా అనిపించే పరిస్థితులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా గురువులకు తెలియజేయాలని సూచించారు. భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ప్రోత్సహించారు.అదేవిధంగా శక్తి యాప్ వినియోగం గురించి మహిళలకు వివరించి, అత్యవసర సమయంలో ఒక క్లిక్‌తో పోలీస్ సహాయం పొందే విధానాన్ని తెలియజేశారు. మహిళలపై నేరాలు, వేధింపుల సందర్భంలో ఈ యాప్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు.పిల్లల భద్రత, మహిళల రక్షణలో సమాజం మొత్తం బాధ్యత వహించాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా నేరాల నివారణకు పటిష్టమైన పునాది వేస్తున్నామని తెలిపారు.