తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలంలోని లోటస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో పదవ తరగతి చదివిన సోమరాజుపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ అర్రిబోయిన రాంబాబు గారి కుమార్తె అర్రిబోయిన భాను శ్రీ కి బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 1000 మార్కులకు గాను 991వచ్చాయి. ఎంపీసీ భాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం సాధించిన లోటస్ హైస్కూల్ పూర్వ విద్యార్థి కి అభినందనలు వెలువెత్తుతున్నాయి.ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో లోటస్ పాఠశాల డైరెక్టర్లు షేక్ నాయబ్ రసూల్, సన్నెబోయిన హరికృష్ణ, నక్కా శ్రీ ఆంజనేయులు మరియు ఉపాధ్యాయులు తమ విద్యార్థి భాను శ్రీ కి అభినందనలు తెలియచేశారు.