తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-

స్థానిక జనార్ధన స్వామి దేవాలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 50 సంవత్సరములుగా నిర్వహిస్తున్న అన్నదాన మరియు వస్త్ర దాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నిరుపేదలు అంగవైకల్యం కలిగిన 30 మంది పురుషులు 40 మంది మహిళలకు వస్త్రధానము, అన్నదానము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఉప్పుటూరి కొండప నాయుడు మాట్లాడుతూ హిందువులందరూ హిందూ ధర్మాన్ని ఆచరించాలని, గో సేవ చేయాలని, చిన్నపిల్లలకి హిందూ సాంప్రదాయాన్ని ఆచరించి చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఏ బలరామకృష్ణ మాట్లాడుతూ అన్నదానము అన్ని దానాలలో కల్లా మిన్న అయినదని వస్త్రధానము మహోన్నతమైనదని సహకరించిన దాతలను కొనియాడారు. 1976 నుండి పిడికెడడు బియ్యం సేకరించడం ద్వారా నిర్వహించే వారిని, ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఈ విధంగా దాతల సహకారంతో నిరుపేదలకు జరపడం సామాజిక సమరసతకు కారణం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఉప్పుటూరు కొండప నాయుడు, ప్రఖండ కార్యదర్శి ఏడుంబాకు రమణయ్య, మరియు అన్నదాన నారాయణ సేవ నిర్వాహకులు ఉరిమి శ్రీకృష్ణ, పల్లపోలు లక్ష్మీనారాయణ, ఆకురాతి రమణ మూర్తి, వేమూరి కృష్ణ, బోణాల నాగేశ్వర రావు, మస్తానయ్య ఆర్.ఎస్.ఎస్ మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *