తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

వేసవి కాలం మొదలై ఎండలు పెరుగుతున్నందున బాటసారులు, సింగరాయ కొండ పట్టణ వాసులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో సింగరాయకొండ పోలీస్‌ వారి ఆధ్వర్యంలో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వేసవి కాలంలో వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజలు, పాదచారులు, అలాగే వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండల ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సింగరాయకొండకు వచ్చే గ్రామాల ప్రజలు చల్లటి తాగునీటి కోసం ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రజా సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తుందని, ప్రజలకు వివిధ రూపాల్లో సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరాయకొండ పోలీసులు సేవాదృక్పథంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇందుకు కృషి చేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. చలివేంద్రం ఏర్పాటు చేయడంపై పరిసర ప్రాంతాల పట్టణ ప్రజలు, చిరువ్యాపారులు, కూలీలు సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ కి మరియు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఎస్సై మహేంద్ర మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *