తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు కోర్టు నందు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం శోభ పదోన్నతిపై వైజాగ్ 14వ అడిషనల్ జిల్లా జడ్జిగా వెళుతున్న సందర్భంగా కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది శ్రీధర్ నాయుడు సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ న్యాయవాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా పనిచేశారని తెలిపారు. తనను ఘనంగా సన్మానించిన న్యాయవాదులకు జడ్జి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కె.వి లక్ష్మీనారాయణ, బెజవాడ కృష్ణయ్య, బీవీ మురళీకృష్ణ, పెన్నా కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *