తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:-

స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ధ్యేయంగా సంబంధిత అధికారులు పనిచేయాలని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డుల పని తీరుపై మంత్రి స్వామి జోనల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ,సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్, స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు డైరెక్టర్ శివప్రసాద్, ప్రభుత్వ విప్ pvgr నాయుడు, విష్ణు కుమార్ రాజు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏకీకృత కృత కుటుంబ సర్వే, పి4,బంగారు కుటుంబాలు, ఆధార్, ఈ కేవైసీ, కేపిఐ, వాట్సాప్ గవర్నెన్స్ తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో మంత్రి స్వామి మాట్లాడుతూ… స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు వచ్చిన తరువాత మొదటి సమావేశం విశాఖపట్నం లో నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ వార్డు కార్యదర్శుల ద్వారా 465 సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. స్వర్ణ గ్రామ వార్డుల్లో పని చేసేవారు ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. రాబోయే ఆరు నెలల్లో స్వర్ణ గ్రామ వార్డులకు హద్దులు నిర్ణయిస్తామన్నారు. గ్రామ వార్డు కార్యదర్శల అనధికార డిప్యూటేషన్లు రద్దుచేసి తిరిగి వారినీ యధా స్థానాల్లో నియమించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏకీకృత కుటుంబ సర్వే తప్పులు లేకుండా పూర్తి చేయాలని,తప్పులు జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సర్వే వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వ అధికారులు చేస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. కుటుంబ సర్వే, వాట్సాప్ సేవలు, మనమిత్ర ఆధార్ తదితర వాటిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించాలని కోరారు. ఎంపీడీవోలు జోనల్ అధికారులు, జిల్లా అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేసి ప్రజలకు వీలైనంత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిఎస్డబ్ల్యూఎస్ అధికారి ఉషారాణి, GVMC అడిషనల్ కమిషనర్ సత్యవేణి, జోనల్ అధికారులు, ఎంపీడీవోలు,పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *