google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో పొదిలి పోలీసులు పోగొట్టుకున్న 13 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి, అన్‌లాక్ చేసి సంబంధిత ఫిర్యాదుదారులకు అందజేశారు.మొబైల్ ఫోన్లు పోయినట్లు అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించిన పోలీసులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటి ఆచూకీని గుర్తించి రికవరీ చేశారు. అనంతరం మొబైల్ ఫోన్లను అన్‌లాక్ చేసి, సంబంధిత యజమానులను గుర్తించి వారికి అప్పగించారు.ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసుల వేగవంతమైన చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆస్తుల రక్షణ, పోగొట్టుకున్న వస్తువుల రికవరీ విషయంలో ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని అధికారులు తెలిపారు.ప్రజలు తమ మొబైల్ ఫోన్లు లేదా ఇతర విలువైన వస్తువులు పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *