కొండపి నియోజకవర్గంలో రెండేళ్లలోనే రూ.532 కోట్ల అభివృద్ధి పనులు
ప్రకాశం జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సుస్థిరకాలం అధికారంలో ఉండాలి
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరులో కొండపి నియోజకవర్గ స్థాయి 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” విజయోత్సవ సభ
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం టంగుటూరులో కొండపి నియోజకవర్గ స్థాయి 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” విజయోత్సవ సభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి, ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం… సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. కొండపి నియోజకవర్గంలో రెండేళ్లలోనే రూ.532 కోట్ల అభివృద్ధి పనులు చేశాం. 2012లో కొండపి రోడ్డు మంజూరు చేయిస్తే ఏడేళ్ల తర్వాత తిరిగి తెదేపా నిర్మించింది. అభివృద్ధికి చిహ్నం తెదేపా, కొండపి నియోజకవర్గంలో పంచాయతీరాజ్, విద్యుత్తుశాఖ, అర్ అండ్ బీ, నీటిపారుదల, వైద్యశాఖ, ఆర్ డబ్ల్యూఎస్, సంగమేశ్వరం తదితర శాఖల పనులకు రూ. 532 కోట్లతో పనులు చేపట్టాం. దేశ వ్యాప్తంగా అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమే. పేదల కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. డీఎస్సీ పోస్టింగులపై కులాలకు ఆపాదించి కులాల మధ్య రెచ్చగొట్టే చేష్టలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే స్వేచ్ఛను ఇస్తే వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో హౌసింగ్ ద్వారా ఇళ్లు నిర్మించుకుంటే ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ నిధులను పక్కదోవ పట్టించారు. అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు ఉండకూడదన్న కారణంతో వైకాపా పేటిఎం బ్యాచ్ నేటికీ అమరావతిపై విషప్రచారమే చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సుస్థిరకాలం అధికారంలో ఉండాలని ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.