తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:-
బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో నిర్వహించిన “ప్రజలతో మాటామంతి” కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి వారి సమస్యలు తెలుసుకుని, అర్జీలు స్వీకరించాను.బీసీల సంక్షేమానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆదరణ 3.0 ద్వారా సంప్రదాయ వృత్తులకు పునర్వైభవం తీసుకువస్తూ, బీసీలను కూలీలుగా కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నాం.పెనుబల్లి గ్రామంలో ఇప్పటికే సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేశాం. ఇంకా మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాము.