google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కొండేపి శ్రీ సంక్షేమ కార్యాలయంలో సెక్టార్ పరిధిలోని మండలాలకు చెందిన 166 అంగన్వాడి కేంద్రాలకు మంజూరైన ఇండక్షన్ కుక్కర్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ & సీడీపీఓ సుశీల దేవి, సూపర్వైజర్ విక్టోరియా రాణి పాల్గొని అంగన్వాడి కార్యకర్తలకు ఇండక్షన్ కుక్కర్లను సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించే విధానాన్ని వివరించారు.కుక్కర్ల నిర్వహణ, విద్యుత్ భద్రతా ప్రమాణాలు, ఆహార తయారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరికరాల సంరక్షణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్కర్ల వినియోగం ద్వారా అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు వేగంగా, పరిశుభ్రంగా, పోషకాహారం అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడి కార్యకర్తలు, సూపర్వైజర్లు కుక్కర్ల వినియోగానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకుని, వాటి సమర్థ వినియోగంపై సూచనలు పొందారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *