తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న ఆహారం నాణ్యతతో పాటు కేంద్రంలోని పరిశుభ్రత, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సేవల నాణ్యత పెంపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండి, పౌష్టికాహారం సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.