google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్నదాత ముఖంలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో తొలి విడతగా 1,87,208 మంది రైతు కుటుంబాల ఖాతాల్లో రూ.125.65 కోట్లు జమ అయినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 జమ చేశాయని పేర్కొన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందించే హామీలో భాగంగానే తొలి విడత నిధులను విడుదల చేశామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం 2.0, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు.జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలికివాయ గ్రామంలో రీ సర్వే సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చాయని, గ్రామంలో మళ్లీ రీ సర్వే చేపట్టి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం అందించిన సకాలపు పెట్టుబడి సాయంపై కలికివాయ, సింగరాయకొండ మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *