google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే తమ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.శనివారం సింగరాయకొండ మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో రూ.47 లక్షల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులను మంత్రి పరిశీలించారు. పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అధికారులు మరియు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు.వసతి గృహాల మరమ్మతుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిరుపేద విద్యార్థులు నివసించే ఈ వసతి గృహంలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, గదుల ఆధునీకరణ వంటి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *