తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు సమీపంలోని దూబగుంట వద్ద 26వ నెంబరు పొగాకు వేలం కేంద్రంలో వేలంపాటను రైతులు శనివారం నిలిపివేశారు. గిట్టుబాటు ధర లభించడం లేదంటూ వేలాన్ని అడ్డుకున్నారు. దాంతో ఒంగోలు రీజనల్ మేనేజర్ జి ఎల్ ప్రసాద్ రైతులతో చర్చించటానికి కందుకూరు వచ్చారు.రైతు నాయకులు సైతం పొగాకు బోర్డు వద్దకు చేరుకొని రైతులతో చర్చించారు.
ఆ సమయంలో రైతులకు, రీజనల్ మేనేజర్ కు వాగ్వాదం జరిగింది.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 20వేల రూపాయలకు తగ్గకుండా పాట నిర్వహించాలని, లేదంటే పాట నిలుపుదల చేస్తామని రైతులు తెగేసి చెప్పడంతో రీజనల్ మేనేజర్ పాటను ప్రారంభించారు. అయితే రైతులకు చెప్పిన మాట ప్రకారం 20 వేలకు కాకుండా, తగ్గించి పాటలు పెట్టడంతో రైతులు మళ్లీ వేలంపాటను అడ్డుకున్నారు.