తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
రోడ్డు ప్రమాదాల నివారణ, ముఖ్యంగా రాత్రి వేళల్లో నిద్రమత్తు కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.జాతీయ రహదారులు మరియు ప్రధాన రహదారులపై రాత్రి వేళల్లో ప్రయాణించే డ్రైవర్లను గుర్తించి, వారికి ముఖం కడుక్కునేందుకు నీరు, త్రాగునీరు మరియు అవసరమైన సలహాలు అందిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. నిద్రమత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, అలసటగా అనిపించినప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మాత్రమే ప్రయాణాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా డ్రైవర్లలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందిస్తూ, ప్రమాద రహిత ప్రయాణానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతూ రోడ్డు భద్రతకు కృషి చేస్తున్నారు.