google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రూడ్ సెట్ (RUDSET) సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల జూలై 6, 2026 నుంచి మహిళలకు 31 రోజుల ఉచిత మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుందని సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.ఈ శిక్షణలో ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్ వంటి అంశాల్లో శిక్షణ అందించనున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంతాల 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణకు అర్హులు.అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పించబడతాయని తెలిపారు.ఆసక్తి గల మహిళలు పూర్తి వివరాల కోసం 95733 63141 నంబర్‌ను సంప్రదించాలని రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *