google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

దాతలు,భక్తుల తో పాటు నరసింహ స్వామి భూ బదలాయింపు తో నారసింహ క్షేత్రం లో నిర్మించిన టి టి డి కళ్యాణ మండపాన్ని శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ధర్మ కర్తల మండలి సభ్యులు,ఆలయ కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణవేణి శనివారం ప్రారంభించారు. ఎంతో కాలంగా పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో భక్తుల సౌకర్యం కోసం కళ్యాణ మండపం నిర్మించాలని చేసిన ప్రయత్నాలు నీటికి ఫలించాయి. టి టి డి నిబంధల ప్రకారం కనీసం రెండు ఎకరాల భూమిని బదిలీ చేయాల్సి ఉండడం తో గత ధర్మకర్తల మండలి, గత ప్రభుత్వ పెద్దల చొరవతో కళ్యాణ మండపం నిర్మాణం పనులు చేపట్టారు. గత మూడు సంవత్సరాలుగా జరుగుచున్న నిర్మాణం పనులు పూర్తి కావడం తో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచనలు ఆదేశాలతో ఆలయ ధర్మకర్తల మండలి, దేవస్థం కార్యనిర్వహణ అధికారి చొరవ తీసుకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా అధికారులు, ధర్మ కర్తల మండలి సభ్యులు, స్వామివారి మొతకాపుల తో లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు ఉదయగి శేష వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు, ఉదయగిరి సుదర్శన చార్యులు ఆలయ మర్యాదలతో కళ్యాణ మండపం ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించి, అర్చక స్వాముల సంప్రక్షణ మధ్య భోజన శాల, వంట శాలలను ప్రారంభించారు. అనంతరం కళ్యాణమండపం లోని కళ్యాణ వేదిక పై లక్ష్మీనరసింహ స్వామి పూజ చేపట్టారు. పూజ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు దంపతులు పాల్గొని పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణవేణి, ధర్మ కర్తల మండలి సభ్యులు, మోత కాపులు, నారసింహ స్వామి భక్తులు,కళ్యాణ మండపం నిర్మాణ కాంట్రాక్టర్ లు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *