google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

గవర్నమెంట్ జూనియర్ కళాశాల, బాపట్లలో లైబ్రేరియన్‌గా విశిష్ట సేవలందించిన శ్రీ మాచిరాజు సత్య ప్రసాదం గారు పదవీ విరమణ చేసిన సందర్భంగా ఆయనకు పలువురు మిత్రులు, సహచరులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఆత్మీయ మిత్రుడు రావుల నాగరాజు (అహం బ్రహ్మాస్మి) మాట్లాడుతూ, సత్య ప్రసాదం గ్రంథాలయాన్ని కేవలం పుస్తకాల నిలయంగా కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన మందిరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. వేలాది మంది విద్యార్థులు ఆయన సేవల ద్వారా విజ్ఞానాన్ని సొంతం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు.ఉద్యోగ జీవితమంతా క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేసిన సత్య ప్రసాదం గారు సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, అందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తిగా నిలిచారని ఆయన అన్నారు. చిరునవ్వుతో పలకరించడం, ఆపదలో అండగా నిలవడం, అందరినీ గౌరవించే సంస్కారం ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలని తెలిపారు.
“పదవీ విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమే. సేవాభావానికి, మానవత్వానికి, స్నేహానికి ఎప్పటికీ విరమణ ఉండదు” అని పేర్కొంటూ, ఇకపై కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తూ తన అనుభవంతో సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రావుల నాగరాజు భావోద్వేగంగా స్పందిస్తూ,”పుస్తకాల మధ్య గడిపిన మీ జీవిత ప్రయాణం
ఎన్నో జీవితాలకు వెలుగునిచ్చింది.
ఉద్యోగానికి ఈ రోజు వీడ్కోలు పలుకుతున్నా,మీ మంచితనానికి, మీ సేవలకు, మీ స్నేహానికి
ఎప్పటికీ వీడ్కోలు లేదు.”
అంటూ తన ప్రియ మిత్రుడికి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు,,

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *