తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో శనివారం జరిగిన పలు శుభకార్యాలలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. పట్టణంలోని సింహాద్రినగర్ లో పత్తిపాటి రాకేష్ – ఝాన్సీరాణి నూతన గృహప్రవేశ వేడుకలో… ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు పాల్గొన్నారు. పెద్దబజారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో టిడిపి ఆర్యవైశ్య నాయకుడు కొత్తూరి వెంకట సుధాకర్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలకు పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పలువురు నాయకులు హాజరయ్యారు.