తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో JDBM టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్ద ఉన్న యాచకులకు, నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆహారం మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆహారం దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం ద్వారా క్రీస్తు ప్రేమను తెలియజేయవచ్చు అన్నారు.
దాతల సహకారంతో ఆహారం వాటర్ బాటిల్స్ ఆదివారం జంగాల వినూత్న, శీలం అరుణ వెంకటేష్ చేతులమీదుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, మైత్రేష్, నితీష్, చరణ్ తేజ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.