google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కొండెపి నియోజకవర్గంలో ఇప్పటికే సింగరాయకొండలో తొలి జనసేన ఆత్మీయ సమావేశం విజయవంతంగా నిర్వహించగా, అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ పిల్లిపోగు పీటర్ బాబు ఆధ్వర్యంలో పొన్నలూరు మండల రెండవ జనసేన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన చిరునామాలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పునఃప్రారంభించారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని ఆవిష్కరించి, పార్టీకి విశేష సేవలందించిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు.అనంతరం నాయకులు జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై ప్రసంగించి, పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొండెపి నియోజకవర్గ నాయకులు పెద్దిశెట్టి మనోజ్ రాయల్, బడుగు నాగార్జున, వీర మహిళలు అలేఖ్య, రేవతి, కుమారి
జరుగుమల్లి మండలం అంకయ్య గారు మరియు పొన్నలూరు మండల నాయకులు, జనసైనికులు మరియు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *