తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యం సేవ (Open Boozing) జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఓపెన్ బూజింగ్‌కు అనువుగా మారిన ప్రదేశాలను శుభ్రపరిచి, అక్కడ పేరుకుపోయిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర చెత్తను తొలగించారు. ఇటువంటి ప్రదేశాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ, ప్రజల్లో అవగాహన కూడా కల్పించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాల గురించి సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.