సుదీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయం
ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఐదుగురు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్, ఒక డీపీఓ సిబ్బంది, ఒక హోం గార్డులను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, వెండి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో చేరినప్పటి నుండి నేటి వరకు ప్రజలకు సేవ చేస్తూ ఉద్యోగ విరమణ పొందడం అదృష్టమన్నారు. పోలీసు ఉద్యోగంలో కుటుంబానికి దూరంగా ఉంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, నిబద్ధతతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించిన వారి సేవలను జిల్లా పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. 32 నుంచి 43 సంవత్సరాల పాటు పోలీసు శాఖకు విశిష్ట సేవలందించి గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయమన్నారు. పోలీసు విధుల నిర్వహణలో ఎల్లప్పుడూ అండగా నిలిచి, సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి యొక్క సర్వీస్ లో రివార్డ్స్, సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, గుడ్ సర్వీస్ పొందియున్నారు.సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, మిగిలిన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది యొక్క కుటుంబ వివరాలను, పిల్లల చదువుల, ఉద్యోగ స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవంతో వ్యవహరిస్తూ, వారి యోగక్షేమాలను జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఉద్యోగ విరమణ పొందిన వారి వివరాలు:1)పి. వెంకటేశ్వర్లు (SI.462), సర్వీస్ -37 సం, మహిళ పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లా.
2)ఎ.వి. సుబ్బారావు (SI.311), సర్వీస్ -40సం”9 నెలలు, ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లా.
3)పి. జనార్ధనరావు (SI.470),సర్వీస్ -37 సం, PGRS, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
4)ఎస్.కె. మస్తాన్ షరీఫ్ (SI.165),సర్వీస్-37 సం attached కందుకూరు ఎస్డీపీఓ కార్యాలయం, ప్రకాశం జిల్లా.
5)బి. అంకరాజు (SI.687),సర్వీస్ -37 సం, స్పెషల్ బ్రాంచ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
6)పి.వి.ఎస్. నారాయణ మూర్తి (ASI.1722), సర్వీస్ -32 సం, ఎస్.ఎన్. పాడు పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లా.
7) పి. శ్రీనివాసులు (ARHC.1598),సర్వీస్ -35 సం” 6నెలలు, ఎఆర్ విభాగం, ప్రకాశం జిల్లా.
8)యు. ఐసయ్య (ARHC.2113), సర్వీస్ – 43 సం,ఎఆర్ విభాగం, ప్రకాశం జిల్లా.
9)బి. కేశవ నారాయణ (ARPC.1599),సర్వీస్ -35 సం” 6నెలలు, ఎఆర్ విభాగం, ప్రకాశం జిల్లా.
10)సి.హెచ్. భాగ్యలక్ష్మి (JOA.3185), సర్వీస్ -22 సం, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ), ప్రకాశం జిల్లా.
11) యు. యాదలింగం,(HG.47),సర్వీస్ – 34 సం, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లా.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామి రెడ్డి, ఆర్ఎస్సై తిరుపతి స్వామి, ASI బాషా, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.