తొలి శుభోదయం టంగుటూరు :-
రైతన్న మీకోసం టంగుటూరు మండలం పరిధిలోని ప్రతి ఒక్క గ్రామం లో ఈ నెల 24నుంచి 29 వ తేదీ వరకు రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమలో భాగంగా 3వ రోజు మన టంగుటూరు మండలం లోని నిడమలూరు గ్రామానికి గౌరవ ఆత్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రత్న మంజుల మరియు గౌరవ మండల వ్యవసాయ అధికారి డి. యుగంధర్ రెడ్డి విచ్చేసి కార్యక్రమంలో భాగంగా రైతులతో మాట్లాడుతూరానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన 5 ప్రణాళికలను ఒక్కటిగా రైతులకు వివరించారు
అదేవిధంగా ప్రతి గ్రామంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల సిబ్బంది ఈ నెల 24 నుంచి 29 వరకు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తారు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో.. గ్రామ టీడీపీ అధ్యక్షులు కాకుమాని శ్రీకాంత్. టీడీపీ గ్రామ ఉపాధ్యక్షులు కాకుమాని సురేష్.. మరియు గ్రామం లోని రైతు సోదరులు.. తలపనేని మాధవ.. తల్లపనేని వెంకట్రావు. తానికొండ వెంకట్రావు.. నల్లూరి కృష్ణయ్య.. వెంకయ్య బెజవాడ కృష్ణ.. బెజవాడ ఆదినారాయణ.. బెజవాడ హరి..తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో AEO వెంకటేశ్వర్లు గారు, గ్రామ వ్యవసాయ సహాయకులు పి. భరత్ కుమార్ ,MPEO SK. శ్రావణి,గ్రామ రెవిన్యూ అధికారి మహేశ్వరావు , పశు సంవర్ధక సహాయకులు పి.శేకర్, ప్రకృతి వ్యవసాయ ICRP శ్రుతి పాల్గొన్నారు