ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయాలు
లింగసముద్రం మండలంలో 25 మందికి 13.75 లక్షలు మంజూరు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా లింగసముద్రం మండలంలోని 25 మంది లబ్ధిదారులకు 13.75 లక్షల రూపాయల ఆర్థిక సహాయాలు మంజూరు కాగా… గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం వాటిని లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలో CMRF చెక్కులు పంపిణీ చేయడం ఇది 39వ సారి అని, మొత్తంగా 1488 మంది లబ్ధిదారులకు 11.54 కోట్ల రూపాయలు అందించామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు తెలిపారు.MLA గారు మాట్లాడుతూ…. జగన్ ప్రభుత్వంలో ఇలాంటి సహాయాలు పేదలకు అందలేదని, కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ, పార్టీలకు అతీతంగా సహాయం అందిస్తున్నామని చెప్పారు. మా ప్రభుత్వంలో నిధుల్లో సింహభాగం సంక్షేమానికి కేటాయిస్తున్నాం. అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తరువాత అన్ని వనరులను ఉపయోగించుకుని, పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో పురోగతి సాధిస్తున్నాం. చంద్రబాబు గారి చిత్తశుద్ధి, ముందుచూపు మన రాష్ట్రానికి గొప్ప వరం… అని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు.CMRF సహాయాలు అందుకున్నవారు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఆశీస్సులు అందించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, రాచగర్ల సుబ్బారావు, జనిగర్ల నాగరాజు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మాదాల లక్ష్మీనరసింహం, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, ఏఎంసీ చైర్ పర్సన్ గా నియమితులైన రాయపాటి సుభాషిణి, ఉన్నం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.