ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాల నివారణపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల భద్రతకు ప్రజల సహకారం అత్యంత అవసరమని వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.అదే సందర్భంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాల నివారణ, సైబర్ మోసాల నుంచి రక్షణ, గంజాయి వినియోగం మరియు అక్రమ రవాణా వల్ల కలిగే దుష్పరిణామాలు, ట్రాన్స్‌ఫార్మర్ సంబంధిత నేరాల నివారణ, రోడ్డు భద్రతా నియమాలు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నివారణలో పోలీసులకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *