కందుకూరు పట్టణంలోని బృందావనంకు చెందిన చనమాల కోటేశ్వరరావు… YCPలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. కోటేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు గుండె జబ్బుతో ఇటీవల ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్ లో చేరారు. ఆపరేషన్ కు 4 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో… కోటేశ్వరరావు స్థానిక టిడిపి నేతలను సంప్రదించారు. వారితో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారిని కలిసి, సాయం చేయాలని అభ్యర్థించారు.విషయాన్ని విన్నవెంటనే ఎమ్మెల్యే గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా… LOC లెటర్ ను కోటేశ్వరరావు చేతికి అందించారు.రాజకీయాల సంగతి తర్వాత… ముందు వెళ్లి మీ నాన్న గారికి వైద్యం చేయించు. ఇంకేమైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి…. అంటూ ఎమ్మెల్యే గారు ఇచ్చిన భరోసాతో కోటేశ్వరరావు మనసు కుదుటపడింది.LOC ద్వారా పేషంట్ కు 2,01,480 రూపాయలు మంజూరు కాగా… రేపు బుధవారం ఆపరేషన్ జరగబోతోంది.రాజకీయంగా వ్యతిరేకమైనా సరే… సాయంకోరి వచ్చిన వారిని కాదనకుండా ఆదుకుంటున్న మంచి మనసున్న వ్యక్తి ఇంటూరి నాగేశ్వరరావు గారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *