ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–167B (NH-167B) పై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక డ్రమ్‌లు (Warning Drums) ఏర్పాటు చేయడంతో పాటు, రాత్రి సమయంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లు (Radium Reflective Stickers) అతికించారు.ఈ చర్యల ద్వారా రాత్రి వేళల్లో రహదారిని వినియోగించే వాహనదారులు ముందుగానే అప్రమత్తమై సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వేగాన్ని నియంత్రిస్తూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని వాహనదారులకు సూచించారు.ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, రోడ్డు భద్రత కోసం ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *