google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు విద్యార్థులు, యువత, మహిళలు మరియు ప్రజలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, మహిళలపై నేరాల నివారణ, పోక్సో (POCSO) చట్టం, సైబర్ నేరాలు మరియు ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ, గంజాయి, డ్రగ్స్ మరియు ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, అలాగే ఆస్తి సంబంధిత నేరాల నివారణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.సైబర్ మోసాలకు గురికాకుండా అపరిచిత లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.అదేవిధంగా మహిళలు, బాలలు ఎలాంటి వేధింపులు లేదా నేరాలకు గురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని, సమాజంలో నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులతో కలిసి పనిచేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed