google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు, ఒంగోలు సబ్ డివిజన్ ఎస్సై లు వెంకటసూర్య, మహేంద్ర, అజయ్ బాబు, బ్రహ్మనాయుడు, భాగ్యరాజు, సుధాకర్ మరియి 45 పోలీస్ సిబ్బంది మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘడియపుడి కాలనీలో మరియు పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా అనుమానిత వ్యక్తులు, నిషేధిత వస్తువులు, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు, వాహనాలు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఒంగోలు రూరల్ సీఐ ఎం. శేషగిరిరావు గారు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు ప్రజలు, యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైతే వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా ఓటీపీలు, బ్యాంకు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఆధార్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. అదే విధంగా మహిళా చట్టాలపై మరియు కొత్త చట్టాలు, శిక్షలుపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ గారు హెచ్చరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed