కలెక్టరేట్‌లో జరగనున్న డీఆర్సీ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో, తాజా నివేదికలతో హాజరై ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు ఆదేశించారు.మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో గత డీఆర్సీ సమావేశంలో లేవనెత్తిన అంశాలపై చేపట్టిన చర్యలను కలెక్టర్ పరిశీలించారు. రైతు సమస్యలు, అన్నదాత సుఖీభవ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర అంశాలపై పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, అవసరమైన ఆర్థిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *