google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్–సార్డ్స్ ఆధ్వర్యంలో ఉళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బేసిన్‌పల్లి పాలెంలో రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు “హక్కులు, పని ప్రదేశంలో భద్రత మరియు సామాజిక రక్షణ” అంశాలపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మహిళా కార్మికులకు రాజ్యాంగం, కార్మిక చట్టాలు కల్పించిన హక్కులు, పని ప్రదేశంలో భద్రత, లైంగిక వేధింపుల నివారణ, ఫిర్యాదు చేసే విధానం, చట్టపరమైన రక్షణ వంటి అంశాలను సులభంగా వివరించారు. ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకొని ధైర్యంగా వినియోగించుకోవాలని సూచించారు.అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సేవలందించిన శ్రీనివాసరావు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగల సీపీఆర్ విధానాన్ని వివరించి, మహిళా కార్మికులతో ప్రత్యక్షంగా ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించారు.శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ సిబ్బంది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలైన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి వివరించి, వాటి ద్వారా లభించే బీమా ప్రయోజనాలు, నమోదు విధానం, అర్హతలను తెలియజేశారు.అదేవిధంగా, వెలుగు ప్రాజెక్ట్‌కు చెందిన కమ్యూనిటీ కోఆర్డినేటర్ ప్రసన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల కోసం రూపొందించిన “మన డబ్బులు – మన లెక్కలు” మొబైల్ యాప్ గురించి వివరించారు. ఈ యాప్ ద్వారా సంఘాల ఆదాయం–వ్యయం, పొదుపులు, రుణాల వివరాలు, ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు డిజిటల్ ఆర్థిక నిర్వహణను మరింత సులభతరం చేసుకోవచ్చని తెలిపారు.కార్యక్రమం ముగింపులో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి మహిళా కార్మికురాలికి జ్యూట్ బ్యాగులు మరియు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ ప్రతినిధులు మధుసూదన్ రావు, సార్డ్స్ సిబ్బంది, వెలుగు ప్రాజెక్ట్ సిబ్బంది మరియు రొయ్యల పరిశ్రమ మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *