ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను గుర్తించి, ఈ-చలాన్లు (e-Challans) విధించారు.హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడాలని పోలీసులు సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *